28 మంది తిహాడ్‌ జైలు అధికారులపై వేటు

ప్రధానాంశాలు

Published : 15/10/2021 04:53 IST

28 మంది తిహాడ్‌ జైలు అధికారులపై వేటు

యునిటెక్‌ మాజీ ప్రమోటర్లతో కుమ్మక్కైన వ్యవహారం..

దిల్లీ: యునిటెక్‌ మాజీ ప్రమోటర్లు అజయ్‌ చంద్ర, సంజయ్‌ చంద్రలతో కుమ్మక్కై, తిహాడ్‌ జైలు నుంచే వారు వ్యాపార లావాదేవీలు జరుపుకొనేందుకు సహకరించిన అధికారులపై వేటు పడింది. తిహాడ్‌ జైలు (ఏడో నంబరు)కు చెందిన 28 మంది అధికారులను దిల్లీ జైళ్ల శాఖ సస్పెండ్‌ చేసింది. మరో ఇద్దరు ఒప్పంద ఉద్యోగులను విధుల నుంచి పూర్తిగా తొలగించాలని నిర్ణయించింది. యునిటెక్‌ మాజీ ప్రమోటర్లతో కుమ్మక్కైన జైలు అధికారులను సస్పెండ్‌ చేయాలని, వారిపై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు జరిపించాలని సుప్రీం కోర్టు ఈ నెల 6న ఆదేశించిన సంగతి గమనార్హం.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన