మరణం ముప్పును తగ్గించే ఏఎల్‌ఏ

ప్రధానాంశాలు

Published : 15/10/2021 05:05 IST

మరణం ముప్పును తగ్గించే ఏఎల్‌ఏ

వాషింగ్టన్‌: సోయాబీన్స్‌, నట్స్‌, మొక్కల నుంచి వచ్చే నూనెల్లోని ఉండే ఆల్ఫా లినోలెనిక్‌ ఆమ్లాన్ని (ఏఎల్‌ఏ) తీసుకోవడం వల్ల గుండె, రక్త నాళాలకు సంబంధించిన వ్యాధుల కారణంగా మరణించే ముప్పు తగ్గుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఏఎల్‌ఏ అనేది ఒమేగా-3 పాలీఅన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లం. గుండె జబ్బుతో మరణాలను తగ్గించడంలో ఈ పదార్థం పాత్రపై ఇప్పటివరకూ అస్పష్టత నెలకొంది. దీన్ని తొలగించడానికి అంతర్జాతీయ శాస్త్రవేత్తలు.. 1991 నుంచి 2021 మధ్యలో సాగిన 41 అధ్యయనాలను పరిశీలించారు. ఏఎల్‌ఏకు గుండె జబ్బులు, క్యాన్సర్‌తో సంభవించే మరణాలకు మధ్య సంబంధాన్ని విశ్లేషించారు. ఏఎల్‌ఏ వల్ల మరణం ముప్పు దాదాపు 10 శాతం మేర తగ్గుతుందని తేల్చారు. అయితే అధిక స్థాయిలో ఈ పదార్థాన్ని తీసుకుంటే క్యాన్సర్‌ మరణాలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. దీన్ని నిర్ధారించడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని తెలిపారు. ఆహారంలో రోజుకు ఒక గ్రాము మేర ఏఎల్‌ఏ పెరిగినా.. గుండె జబ్బుతో మరణించే ముప్పు 5 శాతం తగ్గుతుందని చెప్పారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన