అజయ్‌ మిశ్ర వల్లే లఖింపుర్‌ హింస

ప్రధానాంశాలు

Published : 15/10/2021 05:05 IST

అజయ్‌ మిశ్ర వల్లే లఖింపుర్‌ హింస

కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాలి

యూపీ భాజపా నేత డిమాండ్‌

బలియా: సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను హెచ్చరిస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్ర చేసిన ప్రకటన లఖింపుర్‌ ఖేరి హింసాత్మక ఘటనలకు ఆజ్యంపోసిందని భాజపా నాయకుడు ఒకరు ఆరోపించారు. రైతులకు క్షమాపణ చెప్పకపోగా తన కుమారుడిని మంత్రి సమర్థిస్తున్నారని, ఆయనను మంత్రి పదవి నుంచి తక్షణమే తొలగించాలని యూపీ భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రామ్‌ ఇక్బాల్‌ సింగ్‌ డిమాండ్‌ చేశారు. 8 మంది ప్రాణాలు తీసిన ఘటనలపై ఇప్పటికీ అజయ్‌ మిశ్ర విచారం వ్యక్తం చేయలేదన్నారు. ఇక్బాల్‌ సింగ్‌ గురువారం బలియాలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఆశిష్‌ మిశ్ర తన కారుతో రైతులను తొక్కించాడు. సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాతే అతనిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికీ అజయ్‌ మిశ్ర కేంద్ర మంత్రిపదవిలో కొనసాగుతున్నారు. ప్రధాని మోదీ అతనిని కేబినెట్‌ నుంచి తక్షణమే తొలగించాల’ని కోరారు. లఖింపుర్‌ హింస, గోరఖ్‌పుర్‌ వ్యాపారి హత్య ఘటనలు భాజపా ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీశాయని ఒక ప్రశ్నకు బదులిచ్చారు.

ఘటనా స్థలికి ఆశిష్‌

ఈనాడు, లఖ్‌నవూ: లఖింపుర్‌ ఖేరి హింసాకాండలో సాక్ష్యాలు సేకరించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్ర కుమారుడు ఆశిష్‌ మిశ్ర, మరో ముగ్గురు నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) గురువారం ఘటనా స్థలం వద్దకు తీసుకెళ్లింది. తికోనియా-బన్‌బిర్‌పుర్‌ రోడ్డులో ఘటనల సన్నివేశాన్ని పునఃనిర్మించి నిందితులను పశ్నించినట్లు తెలిసింది. మరోవైపు, ఈ కేసులో అరెస్టయిన అంకిత్‌ అనే నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన