ఒత్తిడితోనే తప్పుడుగా పోక్సో

ప్రధానాంశాలు

Published : 15/10/2021 05:05 IST

ఒత్తిడితోనే తప్పుడుగా పోక్సో

యువతీ యువకుల మధ్య స్నేహ బంధాన్ని  విస్మరించకూడదు

దిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు

దిల్లీ: కొన్ని లైంగిక వేధింపుల కేసుల్లో... యువతీ యువకుల మధ్య ఉన్న స్నేహబంధాన్ని పోలీసులు విస్మరించి, బాలిక కుటుంబం కోరినట్టు ‘పోక్సో’ చట్టం కింద నిందితులపై ఆరోపణలు నమోదు చేస్తున్నారని దిల్లీ హైకోర్టు పేర్కొంది. ఇది విచారకర పరిణామమని, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న స్నేహాన్నీ, బంధాన్నీ విస్మరించరాదని సూచించింది. ఓ అత్యాచార కేసులో 21 ఏళ్ల యువకుడికి బెయిల్‌ మంజూరు చేస్తూ, ఈ వ్యాఖ్యలు చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హర్దోయ్‌కు చెందిన సదరు యువకుడు, మరో బాలిక చాలాకాలం స్నేహంగా మెలిగారు. ఈ క్రమంలో ఆమె గర్భవతి అయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆ యువకుడిపై అత్యాచార ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. యువతి వయసును అందులో 16గా పేర్కొన్నారు. వారు కోరినట్టే పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో నిందితుడు బెయిల్‌ కోరుతూ హైకోర్టును ఆశ్రయించాడు. తన స్నేహితురాలికి 18 సంవత్సరాలని, పరస్పర సమ్మతితోనే లైంగికంగా కలిశామని పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సుబ్రమణియమ్‌ ప్రసాద్‌ గురువారం విచారణ చేపట్టారు. ‘‘యువతీ యువకుల మధ్య స్నేహబంధం ఉన్న విషయాన్ని పోలీసులు విస్మరిస్తున్నారు. కఠినమైన పోక్సో చట్టాన్ని తప్పుడుగా ఆపాదించి, దుర్వినియోగం చేయడం విచారకరం’’ అని పేర్కొన్నారు. బెయిల్‌ మంజూరు చేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన