మన్మోహన్‌ సింగ్‌కు డెంగీ

ప్రధానాంశాలు

Updated : 17/10/2021 06:45 IST

మన్మోహన్‌ సింగ్‌కు డెంగీ

దిల్లీ: భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ డెంగీ జ్వరం బారిన పడినట్లు దిల్లీ ఎయిమ్స్‌ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగవుతోందని శనివారం వెల్లడించారు. 89 ఏళ్ల మన్మోహన్‌.. అస్వస్థత కారణంగా బుధవారం దిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన విషయం తెలిసిందే. ‘‘మన్మోహన్‌కు డెంగీ జ్వరం వచ్చింది. అయితే ఆయన ప్లేట్‌లెట్ల సంఖ్య వృద్ధి చెందుతోంది. ఆరోగ్యం మెరుగుపడుతోంది’’ అని అధికారులు తెలిపారు. ఆస్పత్రిలోని కార్డియో న్యూరో సెంటర్‌లోని ఓ ప్రైవేట్‌ వార్డులో మన్మోహన్‌ చికిత్స పొందుతున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన