బిల్‌ క్లింటన్‌కు అస్వస్థత

ప్రధానాంశాలు

Updated : 17/10/2021 09:46 IST

బిల్‌ క్లింటన్‌కు అస్వస్థత

కాలిఫోర్నియా: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌(75) ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్లింటన్‌తో శుక్రవారం ఫోన్‌లో మాట్లాడానని ఆందోళన చెందాల్సినదేమీ లేదని, ఒకటి రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి వస్తారని అధ్యక్షుడు జో బైడెన్‌ వెల్లడించారు. యూరిన్‌ ఇన్ఫెక్షన్‌తో  బాధపడుతున్న క్లింటన్‌ను మంగళవారం కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన మెడికల్‌ సెంటర్‌లో చేర్పించినట్లు ఆయన సహాయకుడు ఒకరు వెల్లడించారు.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన