జనవరి నుంచి ఈ-ఫైలింగ్‌ తప్పనిసరి

ప్రధానాంశాలు

Published : 17/10/2021 05:18 IST

జనవరి నుంచి ఈ-ఫైలింగ్‌ తప్పనిసరి

హైకోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశం

ఈనాడు, దిల్లీ: పలు విభాగాలకు సంబంధించిన పిటిషన్లను జనవరి ఒకటో తేదీ నుంచి ఈ-ఫైలింగ్‌ చేయాలని హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఈ-కమిటీ ఛైర్మన్‌ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ హైకోర్టులకు లేఖలు రాశారు. హైకోర్టుల నుంచి ఆ ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వాలు, సంస్థలకు, వ్యక్తులకు వెళ్తాయి. తాజా ఆదేశాల ప్రకారం.. ప్రభుత్వాలు చేసే అన్ని రకాల పిటిషన్లు ఈ-ఫైళ్ల రూపంలోనే ఉండాలి. దస్త్రాలుగా దాఖలు చేయకూడదు. రెవెన్యూ, పన్నులు, వాణిజ్య వివాదాలకు సంబంధించిన అన్ని పిటిషన్లతో పాటు ఈ-ఫైల్స్‌ సరిపోతుందని హైకోర్టు భావించిన పిటిషన్లు ఈ-ఫైలింగ్‌ విధానంలోనే దాఖలు చేయాలి. దిగువ కోర్టుల ఉత్తర్వులపై వేసే పిటిషన్లు ఈ-పైళ్ల రూపంలోనే ఉండాలి. అప్పీళ్లు, రివిజన్‌ పిటిషన్లు వేస్తే అందుకు సంబంధించి దిగువ కోర్టుల రికార్డులను డిజిటల్‌గానే అనుసంధానం చేయాలి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన