బంగ్లాలో ఆలయాలపై దాడి

ప్రధానాంశాలు

Published : 17/10/2021 06:14 IST

బంగ్లాలో ఆలయాలపై దాడి

ఘటనల్లో మరో ఇద్దరి మృతి

ఢాకా: బంగ్లాదేశ్‌లో దుర్గ పూజల వేళ ఆలయాలపై ఛాందసవాదులు జరిపిన దాడుల్లో మరో ఇద్దరు మృతి చెందారు. నోవాఖలి ప్రాంతంలోని ఓ ఆలయంపై శుక్రవారం గుంపుగా వచ్చిన వ్యక్తులు దాడికి తెగబడటంతో ఆలయ కమిటీ సభ్యుడు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 200 మంది ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మరో వ్యక్తి మృతదేహాన్ని ఆలయం సమీపాన శనివారం కనుగొన్నారు. దీంతో బంగ్లాదేశ్‌లో గత 3 రోజులుగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో మృతుల సంఖ్య 6కి పెరిగింది. ఆలయాలపై ఛాందసవాదుల దాడులు.. అనంతరం పోలీసుల కాల్పులు వంటి ఘటనల్లో బుధవారం నలుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన