పంజాబ్‌ రైతులను నిరాశపరచొద్దు

ప్రధానాంశాలు

Published : 17/10/2021 06:14 IST

పంజాబ్‌ రైతులను నిరాశపరచొద్దు

అన్నదాతల ఆందోళన పట్ల సున్నితంగా వ్యవహరించాలి

కేంద్రానికి శరద్‌ పవార్‌ హితవు

పుణె: నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన పట్ల సున్నితంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌ సూచించారు. నిరసన కార్యక్రమాల్లో పంజాబ్‌ రైతులే అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని, వీరంతా సరిహద్దు సరిహద్దు రాష్ట్రానికి చెందినవారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. పంజాబ్‌ రైతులను నిరాశపరిచినందుకు దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందంటూ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య సంగతిని ప్రస్తావించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వారిని నిరాశకు గురిచేయవద్దని కేంద్రాన్ని హెచ్చరించారు. పుణెకు సమీపంలోని పింప్రీ వద్ద పవార్‌ శనివారం విలేకరులతో మాట్లాడారు. ‘‘దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్న చోటుకు రెండు మూడుసార్లు వెళ్లాను. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి సరిగా లేదు. ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నవారిలో ఎక్కువమంది పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌లకు చెందినవారే. పంజాబ్‌ సరిహద్దు రాష్ట్రం. వారిని నిరాశకు గురిచేస్తే, తీవ్ర ప్రతిఘటన ఎదురుకావచ్చు. దేశ ఆహార అవసరాలను తీరుస్తున్న రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి’’ అని కేంద్రానికి ఆయన సూచనలు చేశారు.

మరోసారి అవకాశం రాలేదనే ఫడణవీస్‌ విమర్శలు...

ఉద్ధవ్‌ ఠాక్రే మోసపూరితంగా సీఎం పదవి చేపట్టారంటూ భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ విమర్శించడాన్ని పవార్‌ తిప్పి కొట్టారు. మహా వికాస్‌ అఘాడి కూటమి ఏర్పడినప్పుడే ఉద్ధవ్‌ను తాము ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడాన్ని ఆయన గుర్తుచేశారు.తమ పార్టీ శివ సైనికుడిని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెడుతుందన్న ఉద్ధవ్‌... తానే ఆ పదవి చేపట్టి, సీఎం కావాలన్న కోరిక నెరవేర్చుకున్నారని ఫడణవీస్‌ ఆరోపించారు. మహా వికాస్‌ అఘాడి మోసపూరితంగా ఏర్పడిందని విమర్శించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన