జైలు నుంచి జయలలిత దత్తపుత్రుడి విడుదల

ప్రధానాంశాలు

Published : 17/10/2021 06:14 IST

జైలు నుంచి జయలలిత దత్తపుత్రుడి విడుదల

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే: అక్రమ ఆస్తుల కేసులో శిక్ష అనుభవించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత దత్తత కుమారుడు సుధాకరన్‌ బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి శనివారం విడుదలయ్యారు. తమిళనాడు నుంచి వచ్చిన ఆయన మద్దతుదారులు సుధాకరన్‌కు స్వాగతం పలికారు. సుధాకరన్‌కు నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ 2017లో కోర్టు ఆదేశించింది. శిక్షతో పాటు రూ.10 కోట్ల జరిమానా చెల్లించాలని ప్రత్యేక న్యాయస్థానం తన ఆదేశాల్లో పేర్కొంది. జరిమానా చెల్లించకపోతే మరో ఏడాది అదనంగా శిక్షను అనుభవించాలని తీర్పులో స్పష్టం చేసింది. ఆయన జరిమానా చెల్లించలేదు. కానీ, ఇదే కేసులో తమిళనాడులోని వివిధ జైళ్లలో అనుభవించిన 89 రోజుల శిక్షాకాలాన్ని కోర్టు మినహాయించింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన