దిల్లీ-తిరుపతి మధ్య తొలి నాన్‌స్టాప్‌ విమానం

ప్రధానాంశాలు

Published : 18/10/2021 05:18 IST

దిల్లీ-తిరుపతి మధ్య తొలి నాన్‌స్టాప్‌ విమానం

స్పైస్‌జెట్‌ సర్వీసును ప్రారంభించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా

ఈనాడు, దిల్లీ: దేశ రాజధాని దిల్లీ నుంచి ఆధ్యాత్మిక రాజధాని తిరుపతికి తొలిసారిగా స్పైస్‌జెట్‌ సంస్థ నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆదివారం దిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, సహాయమంత్రులు జనరల్‌ వీకేసింగ్‌, ప్రహ్లాద్‌పటేల్‌, స్పైస్‌జెట్‌ సీఎండీ అజయ్‌సింగ్‌లతో కలిసి జెండా ఊపి ఈ విమానసేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతిరాదిత్యసింధియా మాట్లాడుతూ తొలుత బుధ, శుక్ర, ఆదివారాల్లో సర్వీసులు నడుస్తాయని, ఈ నెల 31వ తేదీ నుంచి వారంలో నాలుగురోజుల పాటు సేవలు కొనసాగుతాయని ప్రకటించారు. తిరుపతి విమానాశ్రయం ప్రారంభమై 50 ఏళ్లయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 2022 మే నాటికి రన్‌వే విస్తరణ పనులు పూర్తిచేసి భారీస్థాయి అంతర్జాతీయ విమానాలు దిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన