కేంద్రం నిల్వల నుంచి ఉల్లి విడుదల

ప్రధానాంశాలు

Published : 18/10/2021 05:18 IST

కేంద్రం నిల్వల నుంచి ఉల్లి విడుదల

రాష్ట్రాలకు కిలో రూ.21కే సరఫరా

ఈనాడు, దిల్లీ: దేశంలో ఉల్లి ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ వెల్లడించింది. కేంద్రం నిల్వల నుంచి కిలో రూ.21కే రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు చెప్పింది.జాతీయ స్థాయిలో ఉల్లి చిల్లర ధర కేజీకి సగటున రూ.37.06, టోకు ధర క్వింటాల్‌కు రూ.3,002.25కి చేరినట్లు వెల్లడించింది. ‘ముందు వచ్చిన వారికి ముందు’ ప్రాతిపదికన ఆగస్టు చివరి వారం నుంచి బఫర్‌ నిల్వలు విడుదల చేస్తున్నట్లు తెలిపింది. టమాటా, ఆలూ ధరల నియంత్రణకూ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన