సింగపూర్‌ బాలిక.. జ్ఞాపకశక్తిలో మెరిక

ప్రధానాంశాలు

Published : 18/10/2021 05:18 IST

సింగపూర్‌ బాలిక.. జ్ఞాపకశక్తిలో మెరిక

సింగపూర్‌: ఆరేళ్ల వయసున్న బాలిక తన అద్భుతమైన జ్ఞాపకశక్తితో రికార్డు సాధించింది. గణితంలోని ‘పై’ విలువలో ఎకాఎకి 1,560 దశాంశ స్థానాలను చకచకా చెప్పేసింది. ఇదివరకు సింగపూర్‌కు చెందిన ఓ వ్యక్తి పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది. భారత సంతతికి చెందిన ఇషానీ షణ్ముగం.. ఈ నెల 13న తమ ఇంట్లో కూర్చుని, ‘సింగపూర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ ప్రతినిధుల ముందు పది నిమిషాల పాటు ఏకధాటిగా ఈ అంకెలను చెప్పింది. వాటిని పరిశీలించిన ప్రతినిధులు ఆమె పేరిట రికార్డు నమోదు చేశారు. రెండేళ్ల వయసులోనే ఇషానీలో జ్ఞాపకశక్తి సామర్థ్యాన్ని తాము గుర్తించామని తల్లి వెన్నెల మునుస్వామి తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన