కొనసాగుతున్న శ్రీలంక ఆర్థిక కష్టాలు

ప్రధానాంశాలు

Updated : 18/10/2021 10:30 IST

కొనసాగుతున్న శ్రీలంక ఆర్థిక కష్టాలు

భారత్‌ను రుణసాయం కోరిన పొరుగు దేశం

కొలంబో: కొవిడ్‌ పరిస్థితుల తదనంతరం తీవ్రమైన విదేశీ మారకద్రవ్య సంక్షోభం ఎదుర్కొంటున్న శ్రీలంక చమురు కొనుగోళ్ల చెల్లింపులకుగాను భారత్‌ నుంచి రూ.3,752 కోట్ల (500 మిలియన్‌ డాలర్లు) రుణసాయం కోరింది. శ్రీలంక విద్యుత్తుశాఖ మంత్రి ఉదయ గ్యామన్‌పిలా దేశంలో అందుబాటులో ఉన్న చమురు నిల్వలు వచ్చే జనవరి దాకా మాత్రమే సరిపోతాయని ఇటీవలే హెచ్చరించిన విషయం గమనార్హం. ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిలోన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (సీపీసీ) ఇప్పటికే రూ.24,762 కోట్ల (3.3 బిలియన్‌ డాలర్లు) మేర ప్రధాన ప్రభుత్వరంగ బ్యాంకులైన బ్యాంక్‌ ఆఫ్‌ సిలోన్‌, పీపుల్స్‌ బ్యాంకులకు రుణపడి ఉంది. దేశంలోని చమురు పంపిణీదారులు క్రూడాయిల్‌ను మధ్యప్రాచ్య దేశాల నుంచి, శుద్ధి చేసిన ఉత్పత్తులను సింగపూర్‌ వంటి ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొంటారు. ఇండియా - శ్రీలంక ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా భారత హైకమిషన్‌తో రుణసాయం గురించి చర్చిస్తున్నట్లు సీపీసీ ఛైర్మన్‌ సుమిత్‌ విజేసింఘే మీడియాకు తెలిపారు. ఈ సాయాన్ని పెట్రోలు, డీజిలు కొనుగోళ్లకు వినియోగిస్తామన్నారు.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన