అయోధ్య రాముడికి ‘కోణార్క్‌’ సాంకేతికత

ప్రధానాంశాలు

Published : 18/10/2021 05:18 IST

అయోధ్య రాముడికి ‘కోణార్క్‌’ సాంకేతికత

ఏటా నవమినాడు తాకనున్న సూర్యకిరణాలు

దిల్లీ: అయోధ్య రామాలయ నిర్మాణంలో ఒడిశాలోని 13వ శతాబ్దం నాటి కోణార్క్‌ సూర్య దేవాలయ సాంకేతికతను స్ఫూర్తిగా తీసుకొంటున్నారు. ఏటా శ్రీరామనవమి నాడు సూర్యుడి కిరణాలు గర్భగుడిలోని మూలవిరాట్టు(రామ్‌ లల్లా)పై పడి, ఆ వెలుగు చుట్టూ ప్రసరించేలా ఆలయ నిర్మాణానికి రూపకల్పన చేస్తున్నట్లు శ్రీరామ్‌ జన్మభూమి తీరథ్‌ క్షేత్ర ట్రస్టు సభ్యుడు కామేశ్వర్‌ చౌపాల్‌ పీటీఐకి తెలిపారు. ఈ మేరకు శాస్త్రవేత్తలు, సిద్ధాంతులు, సాంకేతిక నిపుణులతో చర్చలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. నిపుణులతో కూడిన ఓ కమిటీ పూర్తిగా సాంకేతిక అంశాలపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన