ఎఫ్‌టీఏపై వచ్చే నెలలో భారత్‌-ఇజ్రాయెల్‌ చర్చలు

ప్రధానాంశాలు

Published : 19/10/2021 05:14 IST

ఎఫ్‌టీఏపై వచ్చే నెలలో భారత్‌-ఇజ్రాయెల్‌ చర్చలు

జెరూసలేం: భారత్‌-ఇజ్రాయెల్‌ల మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం (ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌-ఎఫ్‌టీఏ) చేసుకునే విషయమై వచ్చే నెలలో చర్చలు ప్రారంభంకానున్నాయి. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జయ్‌శంకర్‌, ఇజ్రాయెల్‌ ప్రత్యామ్నాయ ప్రధానిగా వ్యవహరిస్తున్న విదేశాంగ మంత్రి యాయిర్‌ లాపిడ్‌లు సోమవారం జరిపిన సంభాషణల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గత పదేళ్లుగా కొనసాగుతున్న ఈ చర్చలను త్వరగా పునఃప్రారంభించి వచ్చే జూన్‌ నాటికి ముగించాలని ప్రతిపాదించారు. ఒప్పందం కుదుర్చుకునే దిశగా నిర్ణీత గడువును పెట్టుకోవడం విశేషం. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జయ్‌శంకర్‌ ఇజ్రాయెల్‌ రావడం ఇదే ప్రథమం. ఆదివారం ఇక్కడికి వచ్చిన ఆయన అయిదు రోజులపాటు పర్యటించనున్నారు. వ్యవసాయం, నీటిపారుదల రంగాల్లో సహకారంపైనా చర్చించినట్టు చెప్పారు. పర్యటన సందర్భంగా ఆయన భారతీయ యూదులతో సమావేశమయ్యారు. శతాబ్దాలుగా రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలను బలోపేతం చేయడానికి భారతీయ యూదులు కృషి చేయాలని కోరారు. ఉగ్రవాదం, తీవ్రవాదం విషయాల్లో రెండు దేశాలూ ఒకే తరహా సవాళ్లను ఎదుర్కొంటున్నాయని చెప్పారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన