దేశ భద్రతపై అమిత్‌ షా సమీక్ష

ప్రధానాంశాలు

Updated : 19/10/2021 10:34 IST

దేశ భద్రతపై అమిత్‌ షా సమీక్ష

కశ్మీర్‌లో పౌర హత్యలపైనా చర్చ

దిల్లీ: దేశ భద్రతకు సంబంధించిన పలు అంశాలపై రాష్ట్రాల డీజీపీలు, కేంద్ర సాయుధ బలగాల అధిపతులతో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తాజాగా చర్చలు జరిపారు. దిల్లీలోని ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం ‘జాతీయ భద్రత వ్యూహాల సదస్సు’ ముగింపు సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. కశ్మీర్‌లో పౌర హత్యలు, దేశంలో శాంతిభద్రతల పరిస్థితి, అంతర్గత భద్రత సవాళ్లు తదితర అంశాలపై అందులో విస్తృతంగా చర్చలు జరిపారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాదం పరిస్థితులను సమీక్షించారు. సమావేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డీజీపీలు, కేంద్ర సాయుధ బలగాల అధిపతులు పాల్గొన్నారు.

భాజపా, ఆరెస్సెస్‌ సమన్వయ సదస్సు దిల్లీలో మంగళవారం ప్రారంభం కానుంది. రెండు రోజులపాటు జరగనున్న ఈ సదస్సులో విధానపరమైన అంశాలపై చర్చించనున్నారు. భాజపా సెక్రటరీ జనరల్‌ బి.ఎల్‌.సంతోష్‌ సహా పలువురు ఉన్నతస్థాయి నేతలు, కేంద్ర మంత్రులు హాజరయ్యే అవకాశముంది.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన