పర్యావరణ మార్పులకు కారణం మనుషులే

ప్రధానాంశాలు

Published : 20/10/2021 05:22 IST

పర్యావరణ మార్పులకు కారణం మనుషులే

99.9% పరిశోధన పత్రాలు వెల్లడించిన అభిప్రాయం ఇదే

వాషింగ్టన్‌: మానవుల కార్యకలాపాలే పర్యావరణ మార్పులకు ప్రధాన కారణమని 99.9శాతం పరిశోధన పత్రాలు అభిప్రాయపడుతున్నాయి. 88వేలకు పైగా అధ్యయన పత్రాలను సమీక్షించిన అనంతరం ఈ నిర్ధరణకు వచ్చినట్లు మంగళవారం వెలువడిన ‘ఎన్విరాన్‌మెంటల్‌ రీసెర్చ్‌ లెటర్స్‌’ అనే పత్రిక పేర్కొంది. 1991-2012 మధ్య కాలంలో వచ్చిన పరిశోధన పత్రాల పరిశీలన అనంతరం 2013లో వెలువడిన ఓ నివేదిక కూడా పర్యావరణ విధ్వంసానికి మనుషుల చర్యలే కారణమనే అభిప్రాయానికి వచ్చిందని ఆ పత్రిక వెల్లడించింది. తాజా సర్వే 2012 నుంచి 2020 వరకు ప్రచురించిన పరిశోధన పత్రాలపై కొనసాగింది. దీని సారాంశం కూడా మానవుల కార్యకలాపాలే గ్రీన్‌హౌస్‌ ఉద్గారాల విడుదలకు కారణమని తేల్చిందని సర్వేలో పాల్గొన్న అమెరికాలోని కార్నెల్‌ యూనివర్సిటీ విచ్కీజిజిటింగ్‌ ప్రొఫెసర్‌ మార్క్‌ లినాస్‌ తెలిపారు. అధ్యయనం చేసిన మొత్తం 88,125 పరిశోధన పత్రాల్లో 28 మాత్రమే మానవుల ప్రమేయంపై సందేహాలను వ్యక్తం చేశాయని, చిన్న చిన్న పత్రికల్లో ఇవి ప్రచురితమయ్యాయని నివేదిక సహరచయిత సిమన్‌ పెర్రీ పేర్కొన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన