ముగ్గురు ఇండియన్‌ అమెరికన్లకు శ్వేతసౌధ ఫెలోషిప్‌

ప్రధానాంశాలు

Published : 20/10/2021 05:23 IST

ముగ్గురు ఇండియన్‌ అమెరికన్లకు శ్వేతసౌధ ఫెలోషిప్‌

వాషింగ్టన్‌: ప్రతిష్ఠాత్మక శ్వేతసౌధ ఫెలోషిప్‌ కార్యక్రమం కింద విభిన్న రంగాలకు చెందిన 19 మంది యువ ప్రతిభావంతులైన వృత్తి నిపుణుల పేర్లను ప్రకటించగా.. అందులో ముగ్గురు ఇండియన్‌ అమెరికన్లు చోటు దక్కించుకోవడం విశేషం. వీరంతా 2021-22 సంవత్సరానికి పూర్తికాలం శ్వేతసౌధంలో విధులు నిర్వహిస్తారు. కేబినెట్‌ మంత్రులు, సీనియర్‌ ప్రభుత్వ ఉద్యోగులు, శ్వేతసౌధ సిబ్బందికి సహాయకులుగా వీరందించే సేవలకు ప్రతిఫలం చెల్లిస్తారు. ఈ బృందంలో శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన జాయ్‌ బసు, క్యాలిఫోర్నియాలో ఉంటున్న సన్నీ పటేల్‌, న్యూజెర్సీకి చెందిన ఆకాశ్‌షా చోటు దక్కించుకున్నారు. 1964లో అప్పటి అమెరికా అధ్యక్షుడైన లిండన్‌ బి.జాన్సన్‌ ఈ శ్వేతసౌధ ఫెలోషిప్‌ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన