విద్యుత్తు ట్రైబ్యునల్‌ ఛైర్‌పర్సన్‌ ఎంపికకు కమిటీ

ప్రధానాంశాలు

Published : 20/10/2021 05:27 IST

విద్యుత్తు ట్రైబ్యునల్‌ ఛైర్‌పర్సన్‌ ఎంపికకు కమిటీ

ఈనాడు, దిల్లీ: విద్యుత్తు అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఛైర్‌పర్సన్‌ ఎంపిక కోసం భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైంది. దిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జి.రోహిణి; కేంద్ర నూతన-పునరుత్పాదక ఇంధన శాఖ, పెట్రోలియం-సహజ వాయువుల శాఖల కార్యదర్శులు ఇందులో సభ్యులుగా ఉంటారు. రెండు పేర్లను కమిటీ సిఫార్సు చేస్తుంది. ఈ స్థానంలో కొనసాగిన జస్టిస్‌ మంజులా చెల్లూర్‌ ఆగస్టు 12న పదవీ విరమణ చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు/ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా చేసిన వారే ఈ పదవికి అర్హులు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన