అధికారులను కోర్టుకు పిలిపించడం సరికాదు: సుప్రీం

ప్రధానాంశాలు

Published : 20/10/2021 05:31 IST

అధికారులను కోర్టుకు పిలిపించడం సరికాదు: సుప్రీం

దిల్లీ: ప్రజలకు సేవలు అందించే అధికారులను కోర్టులకు పిలిపించడం అనవసరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఉద్యోగి తొలగింపునకు సంబంధించిన కేసులో... ప్రథమ యూపీ గ్రామీణ బ్యాంకు ఛైర్మన్‌, రీజినల్‌ మేనేజర్‌లు తమ ఎదుట హాజరు కావాలంటూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. అధికారులను పిలిపించుకునే పద్ధతి సరికాదని హితవు పలికింది. అసలు ఉద్యోగిని ఎలా తొలగిస్తారు? బ్యాంకులో రోజువారీ వేతనానికి ఎంతమంది పనిచేస్తున్నారు? అన్న వివరాలు చెప్పేందుకు తమ ఎదుట హాజరుకావాలని బ్యాంకు ఉన్నతాధికారులను అలహాబాద్‌ హైకోర్టు ఆదేశించింది. దీన్ని సవాలుచేస్తూ ఆ బ్యాంకు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై జస్టిస్‌ హేమంత్‌ గుప్త, జస్టిస్‌ వి.సుబ్రమణియన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘‘ఈ కేసులో బ్యాంకు ఛైర్మన్‌, రీజినల్‌ మేనేజర్లను స్వయంగా విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించాల్సిన పనిలేదు. ఉద్యోగి తొలగింపు చట్ట విరుద్ధమని భావిస్తే, అందుకు తగిన ఉత్తర్వులు జారీచేసే అధికారం హైకోర్టుకు ఉంది. అధికారులను కోర్టుకు పిలిపించుకునే పద్ధతి మార్చుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే పేర్కొంది’’ అని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన