కొవిడ్‌పై నిర్లక్ష్యం.. బ్రెజిల్‌ అధ్యక్షుడిపై నేర అభియోగాలు!

ప్రధానాంశాలు

Updated : 21/10/2021 11:06 IST

కొవిడ్‌పై నిర్లక్ష్యం.. బ్రెజిల్‌ అధ్యక్షుడిపై నేర అభియోగాలు!

బ్రసీలియా: కొవిడ్‌ నియంత్రణలో అలసత్వం చూపి ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టారంటూ బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారోపై సెనేట్‌ కమిటీ ఒకటి విమర్శలు గుప్పించింది. ఆయనపై క్రిమినల్‌ అభియోగాలు మోపాలని తాజా నివేదికలో సిఫార్సు చేసింది. ఆరు నెలల సుదీర్ఘ దర్యాప్తు అనంతరం సెనేట్‌ కమిటీ ఈ నివేదికను రూపొందించింది. కొవిడ్‌ మహమ్మారి తీవ్రతను తక్కువ చేసి చెప్పడం, మాస్కులు-భౌతికదూరం వంటి అంతర్జాతీయ ఆరోగ్య మార్గదర్శకాలను నిర్లక్ష్యం చేయడం, టీకాల సముపార్జనపై శ్రద్ధ పెట్టకపోవడం, ప్రజాధనం దుర్వినియోగం వంటి 9 నేర అభియోగాలను బోల్సోనారోపై మోపాలని పేర్కొంది. ఈ నివేదికలో మార్పులు చేసేందుకు ఈ నెల 26 వరకు కాలపరిమితి ఉంది. కరోనా దెబ్బకు బ్రెజిల్‌లో 6 లక్షల మందికిపైగా మృత్యువాతపడ్డ సంగతి గమనార్హం.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన