ఛత్తీస్‌గఢ్‌లో 43 మంది మావోయిస్టుల లొంగుబాటు

ప్రధానాంశాలు

Updated : 21/10/2021 11:11 IST

ఛత్తీస్‌గఢ్‌లో 43 మంది మావోయిస్టుల లొంగుబాటు

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లా గాధిరాస్‌, కుక్‌నార్‌, చింతగుఫా, పుల్బగ్డీ గ్రామాలకు చెందిన 43 మంది మావోయిస్టులు బుధవారం జిల్లా ఎస్పీ సునీల్‌శర్మ, సీఆర్పీఎఫ్‌ అధికారుల సమక్షంలో లొంగిపోయారు. ఆయుధాలు విడిచిపెట్టిన వీరికి రూ.10,000 చొప్పున పోలీస్‌ అధికారులు ఆర్థిక సాయం అందజేయడంతో పాటు ప్రభుత్వపరంగా పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పోలీస్‌ అధికారులు, లొంగిపోయిన మావోయిస్టులు కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన