ముస్లింల వివాహం ఓ ఒప్పందమే: కర్ణాటక హైకోర్టు

ప్రధానాంశాలు

Updated : 21/10/2021 11:24 IST

ముస్లింల వివాహం ఓ ఒప్పందమే: కర్ణాటక హైకోర్టు

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడేే: ‘ముస్లింల వివాహం ఒక ఒప్పందం. ఆ వివాహ పద్ధతిలో పలు కోణాలు ఉంటాయి. హిందువుల వివాహంలా అది ఒక మతకర్మ కాదు’ అని కర్ణాటక హైకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. బెంగళూరుకు చెందిన భువనేశ్వరినగర నివాసి ఇజాజుర్‌ రెహమాన్‌ (52) తన భార్య సైరా భానుకు ముమ్మార్లు తలాక్‌ చెప్పి విడాకులు ఇచ్చారు. తన జీవనోపాధికి భరణం ఇప్పించాలని సైరా భాను 2002 ఆగస్టు 24న న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆమె మరో వివాహం చేసుకునేంత వరకు లేదా, ఆమె మరణించేంత వరకు నెలకు రూ.3 వేలు ఇవ్వాలని రెహమాన్‌ను ఆదేశించింది. ఈ ఆదేశాలపై రెహమాన్‌ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ పూర్తి చేసిన న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణ ఎస్‌.దీక్షిత్‌ ‘ముస్లిం వివాహం ఒప్పందం లాంటిది. దాన్ని రద్దు చేసుకోవడం ద్వారా కొన్ని హక్కుల గురించి ప్రశ్నించేందుకు అవకాశం ఉండదు. ఇతర సముదాయాల్లో మాదిరిగా వీరి వివాహం రద్దయితే.. హక్కులు ఉండవు. చట్ట ప్రకారం పరిశీలిస్తే ఇందులో కొన్ని అభ్యంతరాలు ఉంటాయి. న్యాయ కోణంలో చూస్తే, భార్యకు విడాకులు ఇస్తే భరణం ఇవ్వాల్సి ఉంటుంది. వారు వివాహం చేసుకున్న విధానం ప్రకారం ఏమీ చెల్లించాల్సిన అవసరం ఉండదు’ అని ప్రకటించింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన