నావెల్నీకి మానవ హక్కుల పురస్కారం

ప్రధానాంశాలు

Updated : 21/10/2021 11:19 IST

నావెల్నీకి మానవ హక్కుల పురస్కారం

రష్యా విపక్ష నేతకి ఈయూ బహుమతి

బ్రసెల్స్‌: ఖైదులో ఉన్న రష్యా విపక్ష నేత అలెక్సీ నావెల్నీకి యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ).. అగ్రశ్రేణి మానవ హక్కుల పురస్కారాన్ని ప్రకటించింది. సఖరోవ్‌ బహుమతి కింద ఆయనకు 50,000 యూరోలు (దాదాపు రూ.43.59 లక్షలు) డిసెంబరు 15న అందించనున్నట్లు యూరోపియన్‌ పార్లమెంటు అధ్యక్షుడు డేవిడ్‌ ససోలి తెలిపారు. తిరుగులేని ధైర్య సాహసాలకు నావెల్నీ మారుపేరు అని కొనియాడారు. ‘రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అవినీతి చర్యలపై సామాజిక మాధ్యమ ఖాతాలు, ఇతర రూపాల్లో నావెల్నీ నిరంతర ప్రచారం చేశారు. అధికార దుర్వినియోగాన్ని ఎండగట్టడంలో ప్రజల మద్దతు సమీకరించారు. అందుకే విష ప్రయోగంతో ఆయన్ని జైలు పాల్జేశారు’ అని పేర్కొన్నారు. నావెల్నీని వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈయూ తాజా చర్యతో ఆ కూటమికి, రష్యాకు మధ్య దూరం మరింత పెరగనుంది. ఈ పురస్కారాన్ని నాటో కూడా స్వాగతించింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన