కూలిన మిరాజ్‌-2000 యుద్ధవిమానం

ప్రధానాంశాలు

Published : 22/10/2021 04:51 IST

కూలిన మిరాజ్‌-2000 యుద్ధవిమానం

గ్వాలియర్‌: భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్‌-2000 యుద్ధ విమానం గురువారం మధ్యప్రదేశ్‌లో కూలిపోయింది. జెట్‌ కూలడానికి ముందే పైలట్‌.. పారాచూట్‌ సాయంతో క్షేమంగా బయటపడ్డారు. భిండ్‌ జిల్లాలోని మంకాబాగ్‌ గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది. రోజువారీ శిక్షణలో భాగంగా గ్వాలియర్‌లోని మహారాజపుర వైమానిక స్థావరం నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే ఈ విమానం ప్రమాదానికి లోనైంది. కూలిపోయాక ఈ విమానం అగ్నికీలల్లో చిక్కుకుందని జిల్లా ఎస్పీ మనోజ్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్లే ప్రమాదం జరిగినట్లు వాయుసేన వెల్లడించింది. కారణాలను గుర్తించడానికి విచారణకు ఆదేశించామని తెలిపింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన