దర్యాప్తు ముగింపు లేని కథ కాకూడదు

ప్రధానాంశాలు

Published : 22/10/2021 04:51 IST

దర్యాప్తు ముగింపు లేని కథ కాకూడదు

శివీందర్‌ సింగ్‌ కేసుపై జస్టిస్‌ రమణ వ్యాఖ్య

దిల్లీ: ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ వ్యవస్థాపకుడు శివీందర్‌ మోహన్‌ సింగ్‌ కేసుపై దర్యాప్తు పూర్తి చేయడానికి మరో నాలుగు నెలలు అవసరమని దిల్లీ పోలీసులు గురువారం సుప్రీంకోర్టుకు తెలిపారు. రెలిగేర్‌ ఫిన్వెస్ట్‌ సంస్థకు చెందిన రూ.2,397 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణపై ఆయన రెండేళ్లుగా జైలులో ఉన్నారు. బెయిల్‌ కావాలంటూ ఆయన చేసిన దరఖాస్తుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘‘ఇది ముగింపులేని కథలా ఉండకూడదు. దర్యాప్తు పూర్తి చేయడానికి మీకెంత సమయం కావాలి?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. దిల్లీ పోలీసులు సమాధానం చెబుతూ ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకపోతే నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. దాంతో బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం వాదనలు వినాలని ధర్మాసనం నిర్ణయించింది. రెలిగేర్‌ ఫిన్వెస్ట్‌ నుంచి తీసుకున్న రుణాలను శివీందర్‌ వేరే సంస్థలకు మళ్లించారని, వాటిని తిరిగి చెల్లించకపోవడంతో సంస్థకు రూ.2,397 కోట్ల మేర నష్టం వచ్చిందన్నది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన