జైలులో ఆర్యన్‌తో మాట్లాడిన షారుక్‌

ప్రధానాంశాలు

Published : 22/10/2021 05:04 IST

జైలులో ఆర్యన్‌తో మాట్లాడిన షారుక్‌

ముంబయి: మాదకద్రవ్యాల కేసులో అరెస్టై ప్రస్తుతం ముంబయిలోని ఆర్థర్‌ రోడ్‌ జైలులో ఉన్న ఆర్యన్‌ను గురువారం ఉదయం ఆయన తండ్రి, బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుక్‌ఖాన్‌ కలుసుకున్నారు. జైలు అధికారులు షారుక్‌ ఆధార్‌ కార్డు, ఇతర ధ్రువపత్రాలు తనిఖీ చేసి ఉదయం తొమ్మిదింటికి లోనికి పంపారు. నలుగురు భద్రతా సిబ్బంది సమక్షంలో గాజు గోడకు అవతల ఉన్న కుమారుడితో ఇంటర్‌కాం ద్వారా మాట్లాడిన షారుక్‌ అరగంట తర్వాత జైలు నుంచి బయటకు వచ్చారు. మరోవైపు, ఆర్యన్‌ఖాన్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను 26న విచారిస్తామని బాంబే హైకోర్టు గురువారం వెల్లడించింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన