ప్రత్యేక కారణాలుంటే వీడియో కాన్ఫరెన్స్‌కి అవకాశం

ప్రధానాంశాలు

Updated : 22/10/2021 11:03 IST

ప్రత్యేక కారణాలుంటే వీడియో కాన్ఫరెన్స్‌కి అవకాశం

న్యాయవాదులకు సీజేఐ హామీ

ఈనాడు, దిల్లీ: న్యాయవాదులకు ఆరోగ్యపరమైన ప్రత్యేక కారణాలుంటే ప్రత్యక్ష విచారణ జరిగే బుధ, గురువారాల్లోనూ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వాదనలు వినిపించడానికి అనుమతిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ హామీ ఇచ్చారు. ఈనెల 20వ తేదీ నుంచి సుప్రీంకోర్టులో బుధ, గురువారాల్లో ప్రత్యక్ష విచారణ విధానాన్ని ప్రవేశపెడుతూ నిబంధనలు జారీచేసిన నేపథ్యంలో కపిల్‌ సిబల్‌ సహా, కొందరు సీనియర్‌ న్యాయవాదులు రెండు విధానాలూ అమలు చేయాలని కోరారు. మరోవైపు న్యాయవాదుల సంఘాలు మాత్రం పూర్తిగా భౌతిక విచారణ కొనసాగించాలని కోర్టుకు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమణ గురువారం మధ్యాహ్నం కోర్టు సమయం ముగిసిన తర్వాత అటార్నీ జనరల్‌ కె.కె. వేణుగోపాల్‌, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు మనన్‌ కుమార్‌ మిశ్ర, సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వికాస్‌ సింగ్‌, సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్‌, సి.యు. సింగ్‌, సుప్రీంకోర్టు అడ్వొకేట్‌ ఆన్‌ రికార్డ్‌ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కపిల్‌ సిబల్‌ మాట్లాడుతూ.. సీనియర్‌ న్యాయవాదులంతా వయోవృద్ధులేనని, భౌతిక విచారణకు హాజరైతే ఇబ్బందులు తలెత్తే ప్రమాదముందని తెలిపారు. ఇలాంటి వారికి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యేందుకు అనుమతివ్వాలని కోరారు. అందుకు ప్రధాన న్యాయమూర్తి అంగీకరించారు. ఆమేరకు  నిబంధనల్లో మార్పులు చేస్తామని తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన