పరారీలోని నిందితునికి బెయిల్‌ వద్దు: సుప్రీం

ప్రధానాంశాలు

Published : 22/10/2021 05:04 IST

పరారీలోని నిందితునికి బెయిల్‌ వద్దు: సుప్రీం

దిల్లీ: పరారీలో ఉన్న నిందితునికి, అపరాధిగా పేర్కొంటూ ప్రకటన విడుదలయిన వ్యక్తికీ ముందస్తు బెయిల్‌ ఇవ్వకూడదని గురువారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మోసం చేసిన కేసులో ఈ వర్గంలోకి వచ్చిన నిందితునికి ముందస్తు బెయిల్‌ ఇస్తూ పట్నా హైకోర్టు జారీచేసిన ఆదేశాలను తోసిపుచ్చుతూ పై విషయాన్ని తెలిపింది. ఇచ్చిన వారెంట్లను తీసుకోకపోతే భారత నేర స్మృతిలోని సెక్షన్‌ 82 కింద నిందితుడిని అపరాధి అని కోర్టు ప్రకటన విడుదల చేస్తుంది. అలాంటి ప్రకటన వచ్చినప్పుడు సెక్షన్‌ 83 కింద ఆ అపరాధి ఆస్తులు స్వాధీనం చేసుకోవచ్చు. నిందితునికి కిందికోర్టు ఈ రెండు సెక్షన్లను వర్తింపజేసినా పట్నా హైకోర్టు ముందస్తు బెయిల్‌ ఇవ్వడం తగదని జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. వ్యాపార లావాదేవీల్లో తలెత్తిన వివాదం వల్ల మోసం కేసు నమోదయిందని, ఆ దృష్ట్యా బెయిల్‌ ఇవ్వవచ్చని హైకోర్టు అభిప్రాయపడడం సరికాదని తెలిపింది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన