మేఘాలయలో కొత్త నత్త జాతి

ప్రధానాంశాలు

Published : 22/10/2021 05:04 IST

మేఘాలయలో కొత్త నత్త జాతి

పొడవు 2 మిల్లీమీటర్లే

షిల్లాంగ్‌: నత్తల్లో ఒక కొత్త జాతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ జీవి పొడవు రెండు మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉండటం విశేషం. మేఘాలయలోని తూర్పు ఖాసి హిల్స్‌ జిల్లాలో ఉన్న సున్నపురాయి గుహలో ఇది కనిపించింది. దీనికి ‘జియోరిస్సా మాస్మెయాన్సిస్‌’ అని నామకరణం చేశారు. బెంగళూరులోని ‘అశోకా ట్రస్టు ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఎకాలజీ అండ్‌ ఇన్‌ ద ఎన్విరానిమెంట్‌’ (ఎట్రీ)కి చెందిన నిపు కుమార్‌, ఎన్‌.ఎ.అరివింద్‌లు ఈ ఆవిష్కారం చేశారు. 170 ఏళ్ల కిందట అదే ప్రాంతంలో జియోరిస్సా సారిట్టా అనే జాతి నత్తలను తొలిసారిగా కనుగొన్నారు. తాజాగా వెలుగు చూసిన జీవులూ అదే తరగతికి చెందినవి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన