ఆగని పెట్రో వాత

ప్రధానాంశాలు

Updated : 22/10/2021 12:02 IST

ఆగని పెట్రో వాత

దిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. గురువారం 35 పైసలు చొప్పున పెరిగాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా పెట్రోల్‌ ధర లీటరు రూ.వంద దాటిపోగా, డీజిల్‌ కూడా అందుకు చేరువైంది. శ్రీనగర్‌లో డీజిల్‌ రూ.99.14 ఉండగా, చెన్నైలో రూ.99.59 ఉంది. ఇక పెట్రోల్‌ ధర దిల్లీలో రూ.106.54, ముంబయిలో రూ.112.44 అయింది. నెల రోజుల వ్యవధిలోనే పెట్రోల్‌ 18 సార్లు, డీజిల్‌ 21 సార్లు పెరిగాయి. రాజస్థాన్‌లోని గంగానగర్‌లో అత్యధికంగా పెట్రోల్‌ రూ.118.59, డీజిల్‌ రూ.109.41లకు చేరింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన