చట్టపరమైన ఆమోదమంటే అభ్యంతరమేల?

ప్రధానాంశాలు

Published : 22/10/2021 05:04 IST

చట్టపరమైన ఆమోదమంటే అభ్యంతరమేల?

స్వచ్ఛందసంస్థలకు విదేశీ విరాళాల కేసులో కేంద్రం అఫిడవిట్‌

దిల్లీ: దేశ ప్రగతికి కట్టుబడిన స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలకు విదేశీ విరాళాల చట్టం - 2010 కింద చట్టపరమైన ఆమోదం తప్పనిసరంటే ఎలాంటి అభ్యంతరం ఉండబోదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఎన్జీవోలకు విదేశాల నుంచి అందే విరాళాలకు సంబంధించి ప్రభుత్వ ఆంక్షలపై దాఖలైన పిటిషన్ల విచారణ గురువారం దేశ అత్యున్నత న్యాయస్థానంలో కొనసాగింది. చట్టపరమైన ఆమోదం లేకుండా ఆయా సంస్థలకు విదేశాల నుంచి ఎటువంటి విరాళాలు సేకరించే హక్కు ఉండదని కేంద్రం వాదించింది. ఈ విరాళాల సేకరణ పారదర్శకంగా, బాధ్యతాయుతంగా జరిగితే.. దేశ సార్వభౌమత్వానికి, ప్రజా సమగ్రతకు.. ప్రయోజనాలకు ఎటువంటి ఢోకా ఉండదని అఫిడవిట్‌లో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని కోరింది. జస్టిస్‌ ఎ.ఎం.ఖన్విల్కర్‌ నేతృత్వంలోని ధర్మాసనం కేసు తదుపరి విచారణను అక్టోబర్‌ 28కి వాయిదా వేసింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన