ప్రజల గాయాలను వేడుకలు మాన్పలేవు

ప్రధానాంశాలు

Published : 22/10/2021 05:04 IST

ప్రజల గాయాలను వేడుకలు మాన్పలేవు

కొవిడ్‌ మరణాలపై దర్యాప్తునకు స్వతంత్ర విచారణ కమిషన్‌ వేయాలి

కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌

దిల్లీ: ఆసుపత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ లభించక దేశంలో లక్షల మంది కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారని... ఈ మరణాలపై నిష్పాక్షిక విచారణ చేపట్టేందుకు స్వతంత్ర విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. న్యాయమూర్తులు, నిపుణులు, కరోనా వారియర్లను ఇందులో సభ్యులుగా నియమించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. టీకా కార్యక్రమం గురువారం వంద కోట్ల డోసుల మార్కును అధిగమించిన క్రమంలో... కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్‌ సూర్జేవాలా మీడియాతో మాట్లాడారు. ‘‘ఆప్తులను, ఆస్తులను కోల్పోయిన ప్రజల గాయాలను ఈ వేడుకలు మాన్పలేవన్న విషయాన్ని మోదీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. కరోనా కారణంగా ఎంతమంది చనిపోయారో సర్వే చేపట్టి, బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందజేయాలి. డిసెంబరు 31 నాటికి దేశంలోని వయోజనులందరికీ రెండు డోసుల టీకా అందిస్తామని ప్రధాని చెప్పారు. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే రోజూ 1.5 కోట్ల డోసులు అందించాలి. కానీ, ఆ స్థాయిలో వ్యాక్సినేషన్‌ జరగడం లేదు. వయోజనులందరికీ రెండు డోసుల టీకా ఎప్పుడు ఇస్తారో మోదీయే చెప్పాలి’’ అని సూర్జేవాలా డిమాండ్‌ చేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన