రెస్టారెంట్‌లో పేలుడు; నలుగురి మృతి

ప్రధానాంశాలు

Published : 22/10/2021 05:04 IST

రెస్టారెంట్‌లో పేలుడు; నలుగురి మృతి

బీజింగ్‌: చైనాలోని షెన్‌యాంగ్‌లో గురువారం ఓ రెస్టారెంట్‌లో జరిగిన పేలుడులో నలుగురు మృతిచెందగా, 47 మంది గాయపడ్డారు. పేలుడు జరిగిన మూడంతస్తుల భవనం తీవ్రంగా దెబ్బతినగా, ఆ శిథిలాలతో చుట్టుపక్కల భవనాలు, వాహనాలకు నష్టం వాటిల్లింది. ముందురోజు రాత్రే ఈ ప్రాంతంలో గ్యాస్‌ పైపులైన్‌ నిర్మాణం జరిగింది. ఈ పైపులైన్‌ పేలడంతోనే ప్రమాదం జరిగిందా లేక రెస్టారెంట్‌లో మరేదైనా పేలుడు సంభవించిందా అన్నది స్పష్టంకాలేదు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన