‘పే పాల్‌’ ద్వారా నగదు అక్రమ చలామణి

ప్రధానాంశాలు

Updated : 22/10/2021 12:00 IST

‘పే పాల్‌’ ద్వారా నగదు అక్రమ చలామణి

దిల్లీ హైకోర్టులో వాదనలు

దిల్లీ: అమెరికాకు చెందిన ఆన్‌లైన్‌ చెల్లింపుల సంస్థ ‘పే పాల్‌’ ద్వారా నగదు అక్రమ చలామణి జరుగుతోందని కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఫైనాన్సియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఎఫ్‌ఐయూ) గురువారం దిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఇందుకు సంబంధించిన పత్రాలను సీల్డు కవర్‌లో సమర్పించడానికి అనుమతి ఇవ్వాలని కోరింది. నగదు అక్రమ రవాణా చేస్తున్నందుకు 45 రోజుల్లోగా రూ.96 లక్షల జరిమానా చెల్లించాలని గత ఏడాది డిసెంబరు 17న ఎఫ్‌ఐయూ ఆ సంస్థను ఆదేశించింది. ఉత్తరప్రత్యుత్తరాలు జరపడానికి 15 రోజుల్లోగా ప్రిన్సిపల్‌ ఆఫీసర్‌, డైరెక్టర్‌ను నియమించాలని కూడా సూచించింది. దీనిపై ఆ సంస్థ జనవరిలో హైకోర్టును ఆశ్రయించడంతో స్టే మంజూరు చేసింది. తాజాగా విచారణ జరగగా పే పాల్‌ తరఫు న్యాయవాది సాజన్‌ పూవయ్య వాదనలు వినిపిస్తూ సీల్డు కవర్‌లో పత్రాలను సమర్పించడాన్ని వ్యతిరేకించారు. పరిశీలన నిమిత్తం వాటిని తమకు కూడా అందజేయాలని కోరారు. తాము విదేశీ మారక ద్రవ్య డీలర్లం కామని, కొంత రుసుము తీసుకొని నగదును బదిలీ చేస్తామని తెలిపారు. అందువల్ల నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం తమకు వర్తించదని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ రేఖా పల్లి తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 11వ తేదీకి వాయిదా వేశారు. అవసరం మేరకు సీల్డు కవర్‌లో పత్రాలు సమర్పించడంపై ఆదేశాలు ఇస్తామని తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన