సుధా చంద్రన్‌కు సీఐఎస్‌ఎఫ్‌ క్షమాపణ

ప్రధానాంశాలు

Published : 23/10/2021 04:52 IST

సుధా చంద్రన్‌కు సీఐఎస్‌ఎఫ్‌ క్షమాపణ

దిల్లీ: భరత నాట్య ప్రవీణురాలు, నటి సుధా చంద్రన్‌కు కేంద్ర పారిశ్రామిక భద్రత దళం(సీఐఎస్‌ఎఫ్‌) క్షమాపణలు చెప్పింది. విమానాశ్రయాల్లో తనలాంటి కృత్రిమ అవయవదారులకు ఎదురవుతున్న ఇబ్బందులు, అవమానాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళుతూ ఆమె సామాజిక మాధ్యమంలో ఓ వీడియోను పోస్టు చేసిన నేపథ్యంలో సీఐఎస్‌ఎఫ్‌ ఈ విధంగా స్పందించింది. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా తమ సిబ్బందికి అవగాహన కల్పిస్తామని పేర్కొంది. విమానాశ్రయాల్లో కృత్రిమ అవయవదారులకు జరుగుతున్న అవమానాలను ఆపాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తూ గురువారం సుధా చంద్రన్‌(56) ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు. సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది తనిఖీ చేపట్టే ప్రతిసారీ తన కృత్రిమ కాలును తొలగించి చూపించాలని ఒత్తిడి తెస్తున్నారని, ఇది తనలాంటి వారికి ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్లు అయిన మహిళలకు ఇబ్బందికరమని సుధా చంద్రన్‌ వివరించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన