‘అభ్యాస్‌’ పరీక్ష దిగ్విజయం

ప్రధానాంశాలు

Updated : 23/10/2021 06:02 IST

‘అభ్యాస్‌’ పరీక్ష దిగ్విజయం

బాలేశ్వర్‌: గగనతలంలో వివిధ అస్త్రాలకు లక్ష్యంగా ఉపయోగపడే ‘హై స్పీడ్‌ ఎక్సెపెండబుల్‌ ఏరియల్‌ టార్గెట్‌’ (హీట్‌)ను భారత్‌ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరానికి చేరువలోని చాందీపుర్‌లో ఉన్న సమీకృత పరీక్ష వేదిక (ఐటీఆర్‌)లో ఇది జరిగింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. ఈ మానవరహిత విమానానికి ‘అభ్యాస్‌’ అని పేరు పెట్టారు. దీన్ని వివిధ రకాల క్షిపణుల సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఆకాశంలో ఒక లక్ష్యంగా వాడొచ్చు. తాజా పరీక్షలో దీని సామర్థ్యాన్ని రాడార్లు, ఎలక్ట్రో ఆప్టికల్‌ ట్రాకింగ్‌ వ్యవస్థ సహా పలు సెన్సర్ల సాయంతో పరిశీలించారు. బెంగళూరులో ఉన్న డీఆర్‌డీవో అనుబంధ సంస్థ ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ఏడీఈ) దీన్ని అభివృద్ధి చేసింది. ‘అభ్యాస్‌’ దిగువ భాగంలో రెండు బూస్టర్లు ఉంటాయి. వాటి సాయంతో అది నింగిలోకి లేస్తుంది. స్వతంత్రంగా గగనవిహారం చేస్తుంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన