పెట్రో ధరల ఆల్‌టైం రికార్డ్‌ మోత

ప్రధానాంశాలు

Published : 23/10/2021 05:13 IST

పెట్రో ధరల ఆల్‌టైం రికార్డ్‌ మోత

వరుసగా మూడోరోజు.. 35 పైసల చొప్పున పెంపు

దిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిలు ధరలు శుక్రవారం ఆల్‌టైం రికార్డు స్థాయిలో మోత మోగాయి. వరుసగా మూడోరోజు.. 35 పైసల చొప్పున పెంచారు. దేశంలోని ప్రధాన నగరాలు అన్నింటిలో పెట్రోలు ధర ఇప్పటికే రూ.100 దాటింది. పన్నెండు రాష్ట్రాలకు పైగా డీజిలు ధర ఆ మార్కుకు చేరుకుంది.

ఆ ఆదాయంతోనే టీకాలు: కేంద్ర మంత్రి
దేశంలో డీజిలు, పెట్రోలు ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఓవైపు ప్రతిపక్షాలు గగ్గోలు పెండుతుండగా.. ఈ పన్నుల ఆదాయంతోనే వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు కేంద్ర ఇంధనశాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురి శుక్రవారం మీడియా ఎదుట వెల్లడించారు. వంద కోట్ల డోసుల కొవిడ్‌ ఉచిత వ్యాక్సినేషన్‌ పూర్తి చేశామని, కరోనా కష్టకాలంలో ఏడాది పొడవునా 90 కోట్ల ప్రజలకు మూడుపూటలా భోజన సదుపాయం కల్పించామని, ఉజ్వల పథకం కింద 8 కోట్ల మహిళలకు ఉచిత వంటగ్యాస్‌ అందజేసినట్లు వివరించారు. ఈ పథకాలన్నీ లీటరు ఇంధనంపై కేంద్రానికి వస్తున్న రూ.32 ఎక్సైజ్‌డ్యూటీతోనే సాధ్యమైనట్టు పురి వివరించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన