పాక్‌పై సాధించినది ప్రజాస్వామ్య విజయం

ప్రధానాంశాలు

Updated : 23/10/2021 06:01 IST

పాక్‌పై సాధించినది ప్రజాస్వామ్య విజయం

రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: భారత్‌- పాక్‌ మధ్య 1971 నాటి యుద్ధంలో మన సైన్యం సాధించిన విజయం ప్రజాస్వామ్యానికి దక్కిన విజయమని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అభివర్ణించారు. స్వాతంత్య్ర అమృత మహోత్సవాల్లో భాగంగా బెంగళూరులో శుక్రవారం నిర్వహించిన భారతీయ వైమానిక దళ(ఐఏఎఫ్‌) సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. పాక్‌తో యుద్ధం కేవలం అధికారం, భూభాగాల కోసం జరిగింది కాదని గుర్తుచేశారు. అత్యంత తక్కువ సమయంలోనే ముగిసిన ఈ యుద్ధం భారతీయ రక్షణరంగ చరిత్రలో ఓ మైలురాయిగా పేర్కొన్నారు. భారత రక్షణ రంగం స్వావలంబన దిశగా అడుగులు వేస్తోందని వివరించారు. రక్షణ ఉత్పత్తుల్లో సాధికారత సాధించిన భారత్‌ 2024 నాటికి రూ.35వేల కోట్ల విలువైన ఎగుమతులతో కలిపి మొత్తం రూ.1.75లక్షల కోట్ల వ్యాపారాన్ని లక్ష్యంగా చేసుకుందని రాజ్‌నాథ్‌ సింగ్‌ వివరించారు.

*భారత్‌- పాక్‌ యుద్ధంలో 93వేల మంది పాక్‌ సైనికులు లొంగిపోవటం భారతీయ రక్షణ చరిత్రలో సువర్ణ అధ్యాయమని ఎయిర్‌ చీఫ్‌మార్షల్‌ వివేక్‌రామ్‌ చౌధరి అన్నారు. యుద్ధంలో భారత త్రివిధ దళాలు పూర్తిస్థాయి సాధికారత ప్రదర్శించాయన్నారు. 14 రోజుల్లోనే పాకిస్థాన్‌ పాలన నుంచి బంగ్లాదేశ్‌కు విముక్తి దక్కినట్లు సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ గుర్తుచేశారు.
* ఈ సందర్భంగా ఎల్‌సీఏ తేజస్‌ సిమ్యులేటర్‌ కాక్‌పిట్‌లో కూర్చున్న రక్షణమంత్రి తన అనుభూతిని సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు ఐఏఎఫ్‌ పైలట్‌ రక్షణ కూడా ఈ కాక్‌పిట్‌లో కూర్చుని వ్యవస్థలను నియంత్రించారు. మానవరహిత వాహనాలు, వైమానిక యుద్ధ పరికరాలు, నియంత్రణ వ్యవస్థల తయారీలో ఏడీఏ చేపడుతున్న పరిశోధనలను రక్షణమంత్రి కొనియాడారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన