కాంగ్రెస్‌తో పొత్తు..ఏం చేద్దాం?

ప్రధానాంశాలు

Published : 23/10/2021 05:13 IST

కాంగ్రెస్‌తో పొత్తు..ఏం చేద్దాం?

సీపీఎం కేంద్ర కమిటీ భేటీ ప్రారంభం

దిల్లీ: భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) కేంద్ర కమిటీ సమావేశాలు శుక్రవారం దిల్లీలో ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు కొనసాగే భేటీలో పార్టీ విధానాలకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సహకారం, లేదా ఆ పార్టీతో పొత్తు అంశం ప్రధాన అజెండాగా ఉందని సమాచారం. హస్తం పార్టీతో పొత్తుపై సీపీఎం పొలిట్‌బ్యూరోలో భిన్నాభిప్రాయాలున్నాయి. వామపక్షాల నేతృత్వంలోని లౌకిక కూటమి ప్రాంతీయ పార్టీలతో కలిసి భాజపాను ఎదుర్కోవాలని కేరళ సీపీఎం నేతలు అభిప్రాయపడుతున్నారు. దేశంలోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌తో జట్టుకట్టకుండా పోటీ చేయడం ఆచరణయోగ్యం కాదని పశ్చిమబెంగాల్‌ సీపీఎం నేతలు చెబుతున్నారు. రాష్ట్రాల వారీ పరిస్థితికి, దేశం మొత్తం మీద పరిస్థితికి వ్యత్యాసం ఉంటుందన్నది వారి వాదన. కేంద్ర కమిటీ భేటీలో ఈ వివాదాస్పద అంశాన్ని కూలంకషంగా చర్చించి రాజకీయ తీర్మానం ద్వారా పార్టీ శ్రేణులకు మార్గదర్శనం చేయవచ్చని భావిస్తున్నారు. ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఫలితాలపైనా సమీక్షించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన