గురుడిపై అంతరిక్ష శిలల దాడి

ప్రధానాంశాలు

Published : 23/10/2021 05:18 IST

గురుడిపై అంతరిక్ష శిలల దాడి

టోక్యో: సౌర కుటుంబంలోని అత్యంత పెద్దదైన గురు గ్రహం.. ఖగోళ శాస్త్రవేత్తలకు ఎప్పుడూ వింతగానే ఉంటుంది. దీని భారీ పరిమాణం, అపార గురుత్వాకర్షణ శక్తే ఇందుకు కారణం. అయితే ఈ రెండింటి వల్ల ఈ గ్రహం అంతరిక్ష శిలల దాడిని తీవ్రంగా ఎదుర్కొంటోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇటీవల ఒక గ్రహశకలం.. గురుడి ఉపరితలంలోకి చొచ్చుకెళ్లడాన్ని జపాన్‌లోని పరిశోధకులు గుర్తించారు. నెల రోజుల వ్యవధిలో ఇలాంటి పరిణామం జరగడం ఇది రెండోసారి. దీనివల్ల గురు గ్రహ వాతావరణం నుంచి ప్రకాశవంతమైన కాంతి వెలువడింది. అది గులాబీ వర్ణంలో మెరిసింది. ఆ వెలుగు నాలుగు సెకన్ల పాటు కొనసాగిందని పరిశోధకులు తెలిపారు. దీన్ని దృశ్య, పరారుణ తరంగదైర్ఘ్యాల్లో పరిశీలించినట్లు చెప్పారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన