గోవాలో సీఎంను మార్చనున్న భాజపా

ప్రధానాంశాలు

Published : 24/10/2021 05:29 IST

గోవాలో సీఎంను మార్చనున్న భాజపా

ఆప్‌ ఆరోపణ

దిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ను భాజపా మార్చనుందని ఆప్‌ ఆరోపించింది. ఆప్‌ సీనియర్‌ నాయకుడు మనీశ్‌ శిశోదియా శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ సావంత్‌ ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్తే గెలవడం కష్టమని భావిస్తున్న భాజపా ఆయనను మార్చనున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెప్పాయని వివరించారు. ఎన్నికలకు రెండు, మూడు నెలల ముందు ఈ మార్పు చోటు చేసుకుంటుందని చెప్పారు. భాజపా కొత్త ముఖ్యమంత్రిని నియమించినప్పటికీ గోవాలో గెలుపు తమదేనని శిశోదియా అన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన