అల్‌ఖైదా సీనియర్‌ నేతను డ్రోన్లతో మట్టుబెట్టాం: అమెరికా

ప్రధానాంశాలు

Published : 24/10/2021 05:29 IST

అల్‌ఖైదా సీనియర్‌ నేతను డ్రోన్లతో మట్టుబెట్టాం: అమెరికా

వాషింగ్టన్‌: అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ సీనియర్‌ నేత అబ్దుల్‌ హమీద్‌ అల్‌ మటర్‌ను డ్రోన్ల దాడితో హతమార్చినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. వాయవ్య సిరియాలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సైనిక ప్రతినిధి మేజర్‌ జాన్‌ రిగ్స్‌బీ ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా సహా ప్రపంచంలో వేర్వేరు చోట్ల మరింతగా దాడులకు దిగాలన్న ఉగ్రవాద ప్రయత్నాలకు తమ చర్య ద్వారా అవాంతరం కలిగించగలిగామని చెప్పారు. సిరియాను ఒక స్థావరంగా అల్‌ఖైదా వాడుకుంటోందని తెలిపారు. దక్షిణ సిరియాలో అమెరికా సైనిక్‌ ఔట్‌పోస్టుపై రాకెట్లు, డ్రోన్లతో దాడి జరిగిన రెండ్రోజుల వ్యవధిలోనే ఈ దాడి చోటు చేసుకుంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన