ఫైజాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఇక.. అయోధ్య కంటోన్మెంట్‌

ప్రధానాంశాలు

Published : 24/10/2021 05:29 IST

ఫైజాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఇక.. అయోధ్య కంటోన్మెంట్‌

లఖ్‌నవూ: మూడేళ్ల కిందట ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫైజాబాద్‌ నగరం పేరును అయోధ్యగా మార్చిన యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ఇపుడు స్థానిక రైల్వేస్టేషన్‌ పేరును కూడా ‘అయోధ్య కంటోన్మెంట్‌’గా మార్చనుంది. యోగి సర్కారు తీసుకున్న ఈ నిర్ణయానికి కేంద్రం కూడా ఆమోదముద్ర వేయడంతో నోటిఫికేషను జారీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. యూపీలోని భాజపా సర్కారు ఇప్పటికే అలహాబాద్‌ పేరును ప్రయాగ్‌రాజ్‌గా, ముగల్‌సరాయ్‌ రైల్వేజంక్షన్‌ పేరును పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ జంక్షనుగా మార్చిన విషయం తెలిసిందే.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన