పాక్‌ మహిళా జర్నలిస్టుకు ‘పంజాబ్‌’ ముడుపులు

ప్రధానాంశాలు

Updated : 24/10/2021 05:45 IST

పాక్‌ మహిళా జర్నలిస్టుకు ‘పంజాబ్‌’ ముడుపులు

అమరీందర్‌పై సిద్ధూ భార్య ఆరోపణ

చండీగఢ్‌: ‘మీ స్నేహితురాలైన పాకిస్థానీ జర్నలిస్టు అరూసా ఆలంకు డబ్బులో.. లేదా కానుకలో ఇవ్వకుండా రాష్ట్రంలో ఒక్క పోస్టింగు కూడా అప్పట్లో జరిగేది కాదు’ అంటూ పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌పై ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజోత్‌సింగ్‌ సిద్ధూ భార్య నవజోత్‌ కౌర్‌ సిద్ధూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సిద్ధూకు ప్రధాన సలహాదారుగా ఉన్న మహమ్మద్‌ ముస్తఫా కూడా ఇదే కోణంలో మాజీ సీఎంపై విమర్శలు ఎక్కుపెట్టారు. అమరీందర్‌ ప్రభుత్వ హయాంలో పలుమార్లు పంజాబ్‌ను సందర్శించిన పాకిస్థానీ జర్నలిస్టుకు ఆ దేశ గూఢచార సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతామని పంజాబ్‌ డిప్యూటీ సీఎం సుఖ్‌జిందర్‌సింగ్‌ రంధావా ప్రకటించిన మరుసటిరోజే నవజోత్‌ కౌర్‌ సిద్ధూ ఈ ఆరోపణలు చేయడం గమనార్హం. మాజీ ఎమ్మెల్యే కూడా అయిన కౌర్‌ శనివారం అమృత్‌సర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుశాఖలోనూ ఆలం ప్రమేయం లేకుండా నియామకాలు జరిగేవి కావని, ఇప్పుడు ఆ డబ్బుతో ఆమె ఉడాయించారని ఆరోపించారు. దీనికి స్పందనగా అమరీందర్‌ శిబిరం నుంచి సోనియాగాంధీ మొదలు పలువురు కాంగ్రెస్‌ నేతలతో అరూసా ఆలం దిగిన ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేశారు. అవి పాత చిత్రాలని కాంగ్రెస్‌ నాయకులు కొట్టివేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన