మన భూభాగం నుంచి తొలి స్వదేశీ ప్రైవేటు ఉపగ్రహం!

ప్రధానాంశాలు

Published : 24/10/2021 05:33 IST

మన భూభాగం నుంచి తొలి స్వదేశీ ప్రైవేటు ఉపగ్రహం!

డిసెంబరులో ప్రయోగించే అవకాశం

బెంగళూరు: అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేటు రంగ ప్రవేశం పెరుగుతోంది. ఇప్పుడు దేశీయంగా రూపొందించిన ఓ పూర్తిస్థాయి ప్రైవేటు ఉపగ్రహాన్ని తొలిసారి భారత భూభాగం నుంచి ప్రయోగించనున్నారు. కర్ణాటక బెంగళూరుకు చెందిన పిక్సెల్‌ అనే అంకుర సంస్థ దీనిని తయారుచేసింది. డిసెంబరులో దీన్ని ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది. అధికారిక తేదీ, శాటిలైట్‌ పేరు ఇంకా ఖరారు కాలేదు. నిజానికి ఈ ప్రయోగం గతేడాదే జరగాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది.

నిజానికి 2018లో భారత్‌ తొలి ప్రైవేటు శాటిలైట్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించింది. కానీ  దాన్ని అమెరికా కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్‌ వైమానిక స్థావరం నుంచి స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ ద్వారా ప్రయోగించారు. ఓ ప్రైవేటు సంస్థ నిర్మించి, భారత భూభాగం నుంచి ప్రయోగించనున్న భారత తొలి శాటిలైట్‌ మాత్రం తమదేనని పిక్సెల్‌ అధినేత అవైస్‌ అహ్మద్‌ తెలిపారు. రష్యా నుంచి ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపాలనుకున్నప్పటికీ ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో తమ నిర్ణయాన్ని మార్చుకున్నామని చెప్పారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన