స్వల్ప మోతాదులో డ్రగ్స్‌ను శిక్షల నుంచి తప్పించాలి

ప్రధానాంశాలు

Published : 25/10/2021 04:54 IST

స్వల్ప మోతాదులో డ్రగ్స్‌ను శిక్షల నుంచి తప్పించాలి

దిల్లీ: వ్యక్తిగత వినియోగం నిమిత్తం స్వల్ప మోతాదుల్లో మాదక ద్రవ్యాలు కలిగి ఉండడాన్ని నేరంగా పరిగణించరాదని కేంద్ర సామాజిక న్యాయం- సాధికారత మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. ఈ మేరకు ‘జాతీయ మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల చట్టం’ (ఎన్‌డీపీఎస్‌)ను సమీక్షించాలని అభిప్రాయపడింది. దీనిని కేంద్ర రెవెన్యూ విభాగానికి పంపింది. డ్రగ్స్‌ సేవించినవారికి ఏడాది వరకు జైలుశిక్ష, రూ.20,000 వరకు జరిమానా.. లేదా ఈ రెండూ విధించవచ్చని ఎన్‌డీపీఎస్‌ చట్టంలోని సెక్షన్‌-27 చెబుతోంది. షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ను ఈ సెక్షన్‌ ప్రకారమే అరెస్టు చేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన