నేటి నుంచి సైనిక కమాండర్ల భేటీ

ప్రధానాంశాలు

Published : 25/10/2021 04:53 IST

నేటి నుంచి సైనిక కమాండర్ల భేటీ

దిల్లీ: భారత సైన్యంలోని అగ్రశ్రేణి కమాండర్ల కీలక భేటీ సోమవారం ఇక్కడ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న సరిహద్దులో పరిస్థితి, జమ్మూ-కశ్మీర్‌లో భద్రతా స్థితిగతులు, అక్కడ పౌరుల హత్యలు సహా దేశంలో ఎదురవుతున్న సవాళ్లపై చర్చించనున్నారు. సైనిక పోరాట సన్నద్ధతపైనా సమీక్ష జరుపుతారు. అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న నేపథ్యంలో భద్రతా పరంగా భారత్‌పై పడే ప్రభావం గురించి కూడా చర్చించనున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన