కశ్మీర్‌ అభివృద్ధిని అడ్డుకోలేరు: అమిత్‌ షా

ప్రధానాంశాలు

Updated : 25/10/2021 10:14 IST

కశ్మీర్‌ అభివృద్ధిని అడ్డుకోలేరు: అమిత్‌ షా

జమ్ము: జమ్మూ-కశ్మీర్‌ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలిపారు. ఇక్కడి ప్రజలకు అన్యాయం జరిగే కాలం ముగిసిపోయిందని చెప్పారు. అభివృద్ధిలో యువత భాగమవ్వాలని, అప్పుడే ఉగ్రవాదానికి అడ్డుకట్ట పడుతుందన్నారు. కశ్మీర్‌, జమ్ము ప్రాంతాలు రెండూ సమష్టిగా అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. మూడు రోజుల జమ్మూ-కశ్మీర్‌ పర్యటనలో భాగంగా.. భగవతీనగర్‌ ప్రాంతంలో ఆదివారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ‘‘ఇప్పుడు మీకు ఎవరూ అన్యాయం చేయలేరు. కొంతమంది ఇక్కడ శాంతిని, అభివృద్ధిని అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు. దీన్ని సహించేది లేదు. ఇప్పటికే జమ్మూ-కశ్మీర్‌లోకి రూ.12,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అభివృద్ధిలో యువత భాగమైతే.. ఉగ్రవాదుల వ్యూహం దెబ్బతింటుంది’’ అని చెప్పారు. జమ్మూ కశ్మీర్‌ను అభివృద్ధి చేయడంలో ఎందుకు విఫలమయ్యారో ఆయా కుటుంబాలవారు వివరించాలని పరోక్షంగా కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌లను ఉద్దేశించి అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక జమ్మూ-కశ్మీర్‌లో ప్రాణనష్టం తగ్గిందని చెప్పారు. 370వ అధికరణం రద్దు తర్వాత అమిత్‌ షా తొలిసారిగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన